చరణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

76
rc
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం RC15. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా త్వరలో మూడో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.ఈ తాజా షెడ్యూల్‌ని కూడా ఏపీలోని కర్నూల్, ఏలూరు ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. తొలుత సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న ఆ తర్వాత సమ్మర్ కి వాయిదా వేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని త్వరలో విడుదల చేయనుండగా ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. శంకర్ మార్క్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఫస్ట్ లుక్‌ రీవిల్‌ను భారీ స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట.

ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -