దుబ్బాక పోలింగ్….ఏర్పాట్లు పూర్తి

235
dubbaka by elections

దుబ్బాఉ ఉప ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం పోలింగ్ జరగనుండగా 10న కౌంటింగ్ జరగనుంది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలున్నాయి.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కో బూత్‌లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. 20 రోజుల పాటు హోరాహోరిగా ఎన్నికల ప్రచారం సాగగా టీఆర్ఎస్ నుండి సోలిపేట సుజాత,బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్య‌మ‌య్యింది. అక్టోబర్‌ 9న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపు (ఈనెల 3న‌) పోలింగ్‌ జరుగనుండగా 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.