హ్యాపీ బర్త్ డే…నివేదా థామస్

309
nivedha
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి చిత్రం ‘జెంటిల్ మెన్’ తోనే మంచి విజయాన్ని అందుకుని, అందరి దృష్టిని ఆకర్షించింది నివేదా థామస్. ఆ తరువాత ఆమె నాని హీరోగా తెరకెక్కిన ‘నిన్నుకోరి’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు నివేదా. ‘నిన్నుకోరి’ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ సినిమా అవకాశం దక్కించుకుని.. ఆ సినిమాతోనూ మంచి మార్కులు కొట్టేసింది.

ఇలా వైవిధ్యమైన సినిమాలతో తెలుగు, తమిళ్, మళయాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నివేదా నేడు తన 24వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకున్న నివేదా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -