IPL 2024 :ధోని రిటైర్మెంట్.. ఎప్పుడో?

32
- Advertisement -

క్రికెట్ అభిమానులను ఆద్యంతం అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ నెల 22న ఈ సీజన్ మొదటి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి రోజే క్రికెట్ హీట్ ను పెంచే ఈ ఆసక్తికరమైన పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు టైటిల్స్ అందించిన ఎం‌ఎస్ ధోని ఈ సీజన్ తో రిటైర్మెంట్ తీసుకొనున్నారా ? అంటే కొందరు అవుననే సమాధానం చెబుతుంటే మరికొందరు కాదనే సమాధానం చెబుతున్నారు. క్రికెట్ లోని అన్నీ అంతర్జాతీయ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం 40 ఏళ్ళ వయసున్న ధోని ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే గత సిజనే ధోని లాస్ట్ అని అందరూ భావించారు. కానీ గత సీజన్ లో టైటిల్ గెలిచిన తర్వాత మరో సీజన్ కూడా ఆడతానని ధోని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ధోని రిటైర్మెంట్ గ్యారెంటీ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం ధోని ఫిట్ నెస్ లెవెల్స్ చూస్తే మరో రెండు ఐపీఎల్ సీజన్లు ఆడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

పలువురు మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్న ధోని చాలా ఫిట్ గా కనిపించాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ అప్పట్లో ఉండదనే వార్తలకు మరింత బలం చేరుకుంది. అయితే తన రిటైర్మెంట్ విషయంలో ఎప్పటికప్పుడు అందరికి షాక్ ఇస్తూనే ఉంటాడు ధోని. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించే టైమ్ లో ఎవరి ఊహలకు అందని రీతిలో సడన్ గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అదే విధంగా ఐపీఎల్ విషయంలో కూడా ఎప్పుడొకసారి ధోని సడన్ షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:ష‌ర‌తులు వ‌ర్తిసాయి..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -