ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు. చిరు కెరీర్‌లో గాడ్ ఫాదర్ 153వ చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక తన తర్వాతి చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేయనున్నాడు చిరు. 2023, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుండగా చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను చేస్తున్నారు చిరు.