Chandrayaan 3:సేఫ్‌ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం

32
- Advertisement -

చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం ఉందని ఇస్రో అధికారులు వెల్లడించారు. అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్‌ అయ్యేలా ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను రూపొందించాం అన్నారు. 2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్‌ అయ్యేలా తీర్చిదిద్దామని…. వర్టికల్‌ ల్యాండింగ్‌ అత్యంత కీలకం అని ఇస్రో అధికారులు తెలిపారు.

ఇక 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 జాబిల్లిపై కాలు మోపనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్‌-3లోని ల్యాండర్ మాడ్యూల్( విక్రమ్ ల్యాండర్,ప్రగ్యాన్ రోవర్ తో కలిగి ఉంటుంది)ను చంద్రుడిపై దించేందుకు సర్వం సిద్దం చేసింది ఇస్రో.

చంద్రయాన్-3 విజయవంతమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా, చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -