ఎక్కడైనా అవే హామీలే.. హస్తం పార్టీ ప్లాన్?

32
- Advertisement -

ఏదైనా ఒక ఫార్ములా సక్సస్ అయితే ప్రతిసారి దాన్నే ఫాలో అవుతుండడం సహజం. ముఖ్యంగా హిట్ ఫార్ములా అంటూ సినీ ఇండస్ట్రీలో ఇతర నమ్మకాలు పుట్టుకొస్తుంటాయి. కానీ అన్నీసార్లు అదే సక్సస్ ఫార్ములా హిట్ అవుతుందంటుంటే పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పై వాక్యాలు సరిగ్గా సరిపోతాయి. కర్నాటకలో ప్రకటించిన హామీలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే హామీలను గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించాలని చూస్తోంది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలల్లో కూడా మేనిఫెస్టో విషయంలో కర్నాటక మేనిఫెస్టోనే రిపీట్ చేయాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. .

తాజాగా మద్యప్రదేశ్ లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో చెప్పుకొచ్చారు. రైతు ఋణమాఫీ చేస్తామని, గ్యాస్ సిలిండర్ రూ. 500 కే ఇస్తామని, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తామని ఇంకా 100 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామని హామీలు గుప్పిపించారు ఖర్గే. అయితే ఈ హామీలన్నీ కర్నాటక ప్రజలకు ప్రకటించినవే. ఇవి చాలా వరకు ఉపయోగకరమే అయినప్పటికి రాష్ట్రాల మద్య వ్యత్యాసం ఉన్నట్లు ప్రజా అవసరాల విషయంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మద్యప్రదేశ్ ప్రజల అవసరాలకు తగ్గట్లుగా హామీల విషయంలో మార్పులు చేస్తే బాగుంటుందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. ఇక తెలంగాణలో కూడా ఇదే హామీలను హస్తం పార్టీ రిపీట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి కర్నాటకలో సక్సస్ అయిన ఈ హామీల ఫార్ములా.. ఇతర రాష్ట్రాలలో ఎంతవరుకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -