బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం..

56
- Advertisement -

ఖమ్మం వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగసభ జరగనుంది. ఈ సభకు పలు రాష్ట్రాల సీఎంలతో పాటు వివిధ పార్టీల నేతలు వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత ఇవాళ ఉదయం సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సీపీఐ చీఫ్ రాజా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.

ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెంలో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్​ను ఆనుకొని 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కోసం 448 ఎకరాల్లో 20 బ్లాకులుగా విభజించి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్​కు చెందిన 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరుకానున్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట జిల్లాల నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. ఏపీ నుంచి జనా న్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 2వేల బస్సులు బుక్ చేశారు. మరో 5వేలకు పైగా ప్రైవేట్ వెహికల్స్​ పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -