సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో చెందుతోందనవృద్ధి జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆయా ప్రతిపాదనలతో స్థానిక ఎమ్మెల్యే బలాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ చౌరస్తాలో ఒక వేళ ప్రయివేటు బిల్డర్ ఇల్లు కట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసి ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేదన్నారు.