పుష్ప అప్‌డేట్…

55
allu

అల్రు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”.

ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.