- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుండగా ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
పవన్ మూవీ ఫస్ట్ లుక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యే పవర్ లుక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.
రీ ఎంట్రీతో ఫ్యాన్స్‌ను అలరించనున్న పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తమ అభిమాన నటుడి మూవీ ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మే లో ఈ మూవీ రిలీజ్ కానుండగా రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.
- Advertisement -