అఖిల్ ‘బ్యాచిలర్’..ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

470
akhil
- Advertisement -

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ను ఖారారు చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతం అందించాడు. ఇటివలే విడుదల చేసిన అఖిల్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈమూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. “మనసా మనసా మనసారా బ్రతిమాలా .. తన వలలో పడబోకే మనసా .. ” అంటూ ఈ సాంగ్ సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. సురేంద్ర కృష్ణ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అఖిల్ ఈమూవీతో అయిన విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -