కర్ణాటక కేబినెట్..చోటు ఎవరికి?

5
- Advertisement -

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఈ వారంలో బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో అందరి దృష్టి ఇప్పుడు ఆ రాష్ట్ర కేబినెట్‌లో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్నదానిపై నెలకొంది. డీకే శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యఇవాళ పార్టీ అధిష్టానంతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

మంత్రి పదవుల కోసం ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో ..కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్రమైన లాబీయింగ్ నడుస్తున్న తరుణంలో ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే శివకుమార్, సిద్ధరామయ్యలతో సంప్రదింపులను వేగవంతం చేశారు.

ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, మధు బంగారప్ప మంత్రివర్గంలో చోటు దక్కించుకునే బలమైన రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శరణ్ ప్రకాష్ పాటిల్, రాఘవేంద్ర హిట్నాల్, బసనగౌడ దద్దల్ వంటి పలువురు శాసనసభ్యులు కూడా పార్టీ అధిష్టానంతో మాట్లాడేందుకు ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం.

మంత్రివర్గం పరిమాణం మరియు కూర్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ…శివకుమార్ మాత్రం తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. తనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ…హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అది అమలు చేయబడుతుంది అని తెలిపారు. విలేకరులతో అన్నారు.

జూన్ 3న మధ్యాహ్నం 4:05 గంటలకు శివకుమార్ బెంగళూరులోని లోక్ భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు (కులాలు), అనుభవం మరియు పార్టీ పట్ల విధేయత వంటి అంశాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం సమతూకం పాటించాల్సి ఉన్నందున ఎవరికి ఛాన్స్ దక్కుతుందో వేచిచూడాలి.

Also Read:సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు

- Advertisement -