సీఎం కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు..

47
- Advertisement -

దేశ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో నిరంకుశంగా వ్యవహరిస్తూ, రైతులతో సహా అన్ని వర్గాల ప్రజల ఉసురు తీస్తూ…రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగిస్తూ అణగదొక్కుతూ, రాష్ట్రాల అధికారాలను మెల్లగా సంస్కరణ పేరుతొ లాగేస్తూ ప్రజాస్వామ్య దేశాన్ని కాస్తా అధ్యక్ష తరహా, మతతత్వ దేశంగా మార్చేస్తున్న ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తిరగబడ్డారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి గాంధీబాటలో శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఏడేళ్లలోనే దే యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశ ప్రజల కోసం పిడికిలి బిగించారు. నిరంకుశ మోదీ పాలనను అంతంమొందించి, దేశం నుంచి మతతత్వ పార్టీ బీజేపీని తరిమికొట్టేందుకు సమర శంఖం పూరించారు.

కేవలం రెండు సభలు, రెండు ప్రెస్‌మీట్లతో దేశంలో రాజకీయాలను మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుంది. నిన్నటివరకు మోదీని ఎదిరించడానికి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. మోదీ, బీజేపీపై ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్ సంధించిన ఒక్కో ప్రశ్న దేశ ప్రజల్లోకి తూటాలో దూసుకుపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ మోదీని ఎదిరించి పూర్తిగా డీలా పడిపోయిన వేళ…తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చారు. మమతాబెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే వంటి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫోన్ చేసి సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందు మోదీని గద్దెదించేందుకు కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. త్వరలోనే ఢిల్లీలో బీజేపీయేర రాష్ట్రాల సీఎంల ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఖాయమని జాతీయ మీడియా చెబుతోంది. ఈ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్‌దే కీలక పాత్ర అని టీఎంసీ వర్గాలు ప్రకటించాయి.

కాగా బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోరాటానికి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ‌ అభినందించారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు దేవేగౌడ ఫోన్ చేశారు. రావు సాబ్‌..మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మత తత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమంద‌రం మీకు అండగా వుంటాం.. మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది అంటూ దేవేగౌడ తన మద్దతును ప్రకటించారు.కాగా.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమ‌వుతాన‌ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేవేగౌడ‌కు తెలిపారు.మొత్తంగా దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నింటిని ఒక్క గొడుగు కిందకు తీసుకువచ్చి..మోదీని గద్దె దించే దిశగా మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో సీఎం కేసీఆర్ కీరోల్ పోషించడం ఖాయమని జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.

- Advertisement -