లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా..

451
Exams Postponed
- Advertisement -

దేశంలో క‌రోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఎంసెట్ సహా వచ్చే నెలలో జరగాల్సిన అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆయా ప్రవేశ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

- Advertisement -