కాళేశ్వరం పర్యటనలో కలెక్టర్లు…

736
collectors
- Advertisement -

కాళేశ్వరం పర్యటనలో భాగంగా 33 జిల్లాల కలెక్టర్లు మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించారు. హన్మకొండ హరిత హోటల్ నుంచి పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో కాళేశ్వరం చేరుకున్నారు. తొలుత ప్రాజెక్ట్ నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షించారు. తర్వాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.

అనంతరం మేడిగడ్డకు చేరుకున్న కలెక్టర్లు నీటి లభ్యత, బ్యారేజ్ సామర్థ్యం, ప్రస్తుత నీటి నిల్వ, వరద సమయంలో నీటి ప్రవాహం, గేట్ల నిర్మాణం మొదలైన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ts

తర్వాత కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను సందర్శించి అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం భూగర్భ పంప్ హౌస్ ను అక్కడి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, బాహుబలి మోటార్ల పనితీరును పరిశీలించనున్నారు. కలెక్టర్ల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -