గ్యాంగ్‌లీడర్‌ ట్రైలర్‌:పెన్సిల్ రాసిన ఓరిజినల్ కథ

674
Nani.Gang Leader Trailer
- Advertisement -

జెర్సీ సినిమా త‌ర్వాత నాని నటిస్తున్న సినిమా గ్యాంగ్ లీడ‌ర్. విక్రం కుమార్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా స‌రికొత్త క‌థాంశంతో ఐదుగురు ఆడవాళ్ళ రివెంజ్ నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. నాని పెన్సిల్‌తో డైలాగ్‌లు రాస్తుండటంతో మొదలైన టీజర్‌లో సీనియర్ నటులు ఎంట్రీ ఇవ్వడం,28 రివేంజ్ కథలు రాసాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉంటుందనే డైలాగ్ ఆకట్టుకుంది. రసీదుని చంపు, రైటర్స్‌ ప్రపంచం అంతే చలివేస్తే పుస్తకాలు కప్పుకుంటాం అంటూ నాని చెప్పే డైలాగ్ సూపర్బ్. ప్రపంచంలో ఎంతటి మగవాడినైన మాయచేయలగలిగే ఒకే ఒకపవర్ ఫుల్ వెపన్ అమ్మాయి అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్రలో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న రైట‌ర్ కావడానికి ఇంగ్లీష్ సినిమాలను కాపీ కొడుతూ ఉండే వర్ధమాన రైటర్ అనేది సినిమాని బట్టి అర్ధం అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -