సంతన్న గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన కృష్ణుడు

826
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అద్భుత స్పందన వస్తోంది. సినీ,రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటుతూ ఓ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరికొంతమందికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసురుతున్నారు.

తాజాగా జెఎస్‌టీయుహెచ్‌ ఆవరణలో మొక్కలు నాటారు సినీ నటుడు కృష్ణుడు. రోటరి క్లబ్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతేగాదు జెఎన్‌టీయు విద్యార్థులకు,ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ టీంకు గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

rotari club

- Advertisement -