22 నుండి అసెంబ్లీ సమావేశాలు..

207
ts assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి 25 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ప్రగతి భవన్‌లో బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వ ప్రాధాన్యాలు,పథకాలు,వాటికయ్యే ఖర్చు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలన్నారు.

ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటలకు ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపునకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. పేదల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయించేలా బడ్జెట్ కూర్పు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -