పెళ్ళి చూపులు దర్శకుడితో మహేశ్ బాబు

250
Tharun Bhaskar Mahesh babu
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్‌ భాస్కర్. కొద్ది రోజుల తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈచిత్రం ప్రేక్షకులను అలరించకోవడంతో పెద్దగా విజయం సాధించలేదు. ఇక తరుణ్ భాస్కర్ తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడా అని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ ఈమధ్య డైరక్షన్ కంటే నటనపై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. తాజాగా ఫలక్ నూమా దాస్ మూవీలో నటించాడు. ఇటివలే విడుదలైన ఈటీజర్ లో రఫ్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ మహేశ్ బాబును డైరెక్ట్ చేయనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరుణ్ భాస్కర్ ఇటివలే మహేశ్ ను కలిశాడట.

Tharun Bhaskar

తరుణ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో మహేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. కానీ మహేశ్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కేది సినిమా కాదట. ఒక ప్రముఖ బ్రాండ్ కో్సం మహేశ్ బాబు అడ్వర్టైజ్ మెంట్ ను తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తారట. సదరు యాడ్ డీటెయిల్స్ చర్చించేందుకే మహేష్ ను తరుణ్ కలిశాడట. ఈమధ్య నాగచైతన్య, సమంతతో ఓ యాడ్ తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ఆ యాడ్ చూసిన మహేష్ చాలా బాగుందని కితాబిచ్చాడట. అందుకోసమే మహేశ్ నెక్ట్స్ యాడ్ రూపొందించే బాధ్యతలను తరుణ్ కు అప్పగించారట. త్వరలోనే మహేవ్ ఈ షూటింగ్ లో పాల్గోననున్నారని సమాచారం. ఇక తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్ లో జరగుతుంది.

- Advertisement -