- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ అయ్యింది. కరోనా నివారణతో పాటు పలు అంశాలపై కేబినెట్ లో చర్చించారు. సహకార బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఇక నుంచి సహకార బ్యాంకులన్ని ఆర్బీఐ పరిధిలోకి రానున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా 1,482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులతో పాటు 58మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.
ఇప్పటినుంచి సహాకార బ్యాంకులు అన్ని ఆర్బీఐ పర్యవేక్షణలో నడువనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. దేశంలో పాస్ పోర్ట్ జారీ చేసే ప్రక్రియ కూడా మరింత సులభతరం కానుందని తెలిపారు మంత్రి ప్రకాశ్ జవదేవకర్.
- Advertisement -