Bhumana:గోసంరక్షణ అందరి బాధ్యత

19
- Advertisement -

గోవు హిందువులకు తల్లి లాంటిదని, భగవంతునితో సమానంగా పూజలు చేస్తారని, అలాంటి గోవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. గోకులాష్టమి సందర్భంగా గురువారం టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి-గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా, అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు.

గోశాలలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గోశాలలో సాహివాల్ గోసంతతి అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను గుర్తించి రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్ల గ్రాంట్ అందించిందని వెల్లడించారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి సందర్భంగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టీటీడీ కొన్ని సంవత్సరాలుగా గోసంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని చెప్పారు. గోమాత విశిష్టతను తెలిపేలా అవసరమైన రైతులకు గోవులను దానంగా ఇస్తున్నట్టు చెప్పారు. పూర్వపు రోజుల్లో ప్రతి రైతు ఇంట్లో గోవులు ఉండేవని, గతంలో ఒట్టిపోయిన గోవులను రైతులు గోశాలకు ఇస్తే, వాటిని సంరక్షించేవారని వివరించారు.

Also Read:తొలికిరణం..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -