అలిపిరికి అల్లంత దూరంలో..చిత్రయూనిట్‌

146
- Advertisement -

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మా తిరుపతి’ పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకి సంతాపం తెలుపుతూ చిత్ర బృందం నివాళులు అర్పించింది.

అనంతరం రావణ్ నిట్టూరు మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ నా మొదటి సినిమా. ఇంత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అనందంగా వుంది. ఇంత మంచి స్క్రిప్ట్ లో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్ కి కృతజ్ఞతలు. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నటీనటులంతా కొత్తవాళ్ళమే. అయితే మంచి కథ, దానిని సరిగ్గా హ్యాండిల్ చేసే ఆనంద్ లాంటి దర్శకుడు వున్నప్పుడు కొత్తవాళ్ళతో కూడా మంచి సినిమా తీయొచ్చని ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. కథ విన్నప్పుడు ఎంత నమ్మకంగా వున్నానో సినిమా చూసిన తర్వాత ఆ నమ్మకం డబులైయింది. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి” అని కోరారు.

శ్రీనికిత మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో “లాంటి మంచి కథలో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్ కి, నిర్మాతలు రమేష్, రాజేంద్రకి కృతజ్ఞతలు. ఫణి కళ్యాణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తిరుపతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. డీవోపీ డిజికె బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. కొత్తనటీనటులు కలిసి చేసాం. ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. నవంబర్ 18న అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.

దర్శకుడు ఆనంద్ జె మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ దర్శకుడిగా నా మొదటి సినిమా. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. మా నిర్మాతలకు కృతజ్ఞతలు. డీవోపీ డిజికె, సంగీతం ఫణి కళ్యాణ్, ఎడిటర్ సత్య గిడుతూరి, కిట్టువిస్సాప్రగాడ, అందరూ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. మా తిరుపతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. కొత్త నటీనటులు అందరూ చాలా అంకితభావంతో చేశారు. రావణ్ నిట్టూరు, శ్రీనికిత చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరికీ మంచి అవకాశాలు రావాలి. నవంబర్ 18న సినిమా విడుదలౌతుంది. ఇందులో పూర్తిగా తిరుపతి నేటివిటీని చూస్తారు. మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుతుంది” అన్నారు

నిర్మాత రెడ్డి రాజేంద్ర పి మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ చిత్రానికి పని చేసిన అందరూ చాలా అంకిత భావంతో పని చేశారు. దర్శకుడు ఆనంద్ ఈ సినిమాకి కర్త కర్మ క్రియగా ముందుకు నడిపారు. డీవోపీ డిజికె, సంగీతం ఫణి కళ్యాణ్, ఎడిటర్ సత్య గిడుతూరి అందరూ అద్భుతంగా పని చేశారు. నటీనటులు అందరూ చాలా అనుభవం వారిలా ఫెర్ ఫార్మ్ చేశారు. 16న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. అయితే ప్రస్తుతం నెలకొన్న విషాదం సమయంలో వేడుకని రద్దు చేశాం. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థ్రిల్లర్ తో పాటు ప్యామిలీ ఎలిమెంట్స్ తో డివైన్ టచ్ వున్న సినిమా ‘అలిపిరికి అల్లంత దూరంలో. నవంబర్ 18న తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఓవర్సీస్ లో కూడా విడుదల కాబోతుంది. అందరూ థియేటర్ లో చూసి మనస్పూర్తిగా ఆదరించాలి” అని కోరారు.

నిర్మాత రమేష్ డబ్బుగొట్టు మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా అంతా తిరుపతిలోనే జరుగుతుంది. తిరుపతి నెటివిటీకి తగ్గట్టు అందరూ కొత్త వారితోనే సినిమా చేశాం. నటీనటులంతా అద్భుతంగా చేశారు. శతావధాని మురళి మేము అడగగానే హరిదాసు పాత్రని ఇందులో చేశారు. అలాగే కథ మొత్తాన్ని పద్యంలో గొప్పగా రాసిచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి..

పాన్ ఇండియా హీరోలు..ఇదేం పని ?

మిస్టర్‌ 360 సూర్య @ నెంబర్ 1

సిద్దిపేటలో శ్రీసత్యసాయి బాలల గుండె చికిత్స

- Advertisement -