‘ఆకాశ‌వాణి’లో హీరో జీవిత రాజ‌శేఖ‌ర్..

255
akashavani movie
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ ఇటివ‌లే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే.నూత‌న ద‌ర్శ‌కుడు ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. గ‌తంలో రాజ‌మౌలి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈసినిమా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈమూవీకి ఆకాశ‌వాణి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను కూడా విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి కుమారుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు.

జ‌న‌వ‌రి నుంచి ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈమూవీలో హీరో జీవిత రాజ‌శేఖ‌ర్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈమూవీలో విల‌న్ పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంద‌ట‌. ఆ పాత్ర‌లో హీరో రాజ‌శేఖ‌ర్ అయితే బాగుంటుంద‌ని అత‌న్ని సంప్ర‌దించార‌ట చిత్ర‌బృందం. అయితే మొద‌ట ఈపాత్ర‌లో మోహ‌న్ లాల్ ను అనుకున్నారు కానీ ఆయ‌న‌కు డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో రాజ‌శేఖ‌ర్ ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈసినిమాలో అంద‌రూ కొత్త వాళ్లే న‌టిస్తున్నార‌ని టాక్.

- Advertisement -