పెళ్లిళ్ల పేరిట ఒంటరి వృద్ధులపై వలపు వల వేసి దోచుకుంటున్నారు కిలాడీ లేడీలు. ఒంటరి మహిళను, వయసుతో సంబంధం లేదు, తనను బాగా చూసుకుంటే చాలు అని వల వేస్తున్నారు. భార్య లేని డబ్బులున్న ఒంటరి వృద్ధులే టార్గెట్.. దాదాపు 100 మందికి పైగా బాధితులు ఉన్నారంటే ఈ కిలాడీ లేడీల ఆగడాలు ఎంతలా పెరిగిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ – తిరువూరుకు చెందిన తాయారమ్మ అలియాస్ సరస్వతి.. ఖమ్మం – కొత్తగూడెం వాసి స్వాతి, హైదరాబాద్‌లో ఉంటూ పెళ్లిళ్ల బిజినెస్ చేస్తోంది. ఇద్దరిలో ఒకరి ఫోటో పెట్టి భర్త లేడు, బాగా చూసుకుంటే చాలు అని మ్యారేజ్ బ్యూరోలో ప్రకటన ఇచ్చి ట్రాప్ చేస్తోంది.
నమ్మించి హైదరాబాద్‌కు రప్పించి బంగారం, చీరలు కొని, అవసరాలకు డబ్బులు, మండపం బోజనాలు అంటూ మరిన్ని డబ్బులు తీసుకొని మొహం చాటేస్తున్నారు. పెళ్లి గురించి ప్రస్తావన ఎత్తితే వేధింపులు చేస్తున్నారంటూ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సరస్వతి భర్త ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉండి సస్పెండ్ అవ్వగా.. స్వాతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

