సంతోష్ శోభన్‌తో అలేఖ్య హారిక

44
- Advertisement -

బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో స్టార్ హీరో నాగ చైతన్య క్లాప్ తో ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ హీరో నాగ చైతన్యతో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా..ఫస్ట్ షాట్ కు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సాంకృత్యన్ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – ఎస్ కేఎన్, సాయి రాజేశ్ తో కలిసి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము కలిసి ఇప్పటికే సినిమా చేయాల్సింది. సాయి రాజేశ్ ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. బేబి అద్భుమైన లవ్ స్టోరి. ఒక హీరోగా నాపై ఎంతో నమ్మకం పెట్టుకునే ఎస్ కేఎన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. డైరెక్టర్ సుమన్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అలేఖ్యతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా. మా సినిమాకు మంచి టీమ్ కుదిరింది. అన్నారు

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – మా అమృత ప్రొడక్షన్స్ లో కలర్ ఫొటో అనే సినిమా నిర్మించాను. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ క్రేజ్ లో వెంటనే సినిమా చేయలేదు. ఎందుకంటే మంచి కథ కుదిరినప్పుడే సినిమా నిర్మించాలని అనుకున్నా. అలాంటి కథ ఈ సినిమాకు సెట్ అయ్యింది. నేను, ఎస్ కేఎన్ కలిసి ఆరు లవ్ స్టోరీస్ చేయాలని అనుకున్నాం. కలర్ ఫొటో, బేబి వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. ఈ మూవీతో కలిపి నాలుగు అయ్యాయి. మరో రెండు లవ్ స్టోరీస్ చేస్తాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయా, సీక్వెల్సా అనేది ఇప్పుడే చెప్పలేను. ఇది నా మనసుకు దగ్గరైన కథ. నేను, ఎస్ కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా నా ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్నా కాబట్టి మరింత బాధ్యతగా ఫీలవుతున్నా. అన్ని క్రాఫ్టుల్లో ఈ సినిమాను ది బెస్ట్ గా తీసుకొస్తాం. యాక్టింగ్ వైపు ప్రాణం పెట్టే హీరో కావాలనుకున్నప్పుడు నాకు సంతోష్ శోభన్ గుర్తొచ్చారు. అన్నారు.

Also Read:మ్యూజికల్ ప్రమోషన్స్‌లో ‘సైంధవ్’

- Advertisement -