తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సరిలేరు టీం..

291
mahesh

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో మహేష్ బాబు ఫ్యామిలీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర్, నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు చిత్ర బృందానికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.