ఓటీటీలో 125 కోట్లకు ‘లక్ష్మీబాంబ్’..

42
Laxmmi Bomb

బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఈ హీరో నటించిన హారర్ కామెడీ ‘లక్ష్మీబాంబ్’. త్వరలో హాట్​స్టార్​లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వ‌నుంది. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సంస్థ క‌న్ఫామ్ చేసింది. మొద‌ట‌ చర్చలు విఫలమైనా, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదిరిందని చెప్పింది. కొన్నిరోజుల్లో ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుందని స్పష్టం చేసింది.

Laxxmi Bomb

ఈమేరకు ఈ చిత్రం ఓటీటీ హక్కులను హాట్ స్టార్ సంస్థ 125 కోట్లకు దక్కించుకున్నట్టు పేర్కొంది. మామూలుగా ఈ స్థాయి చిత్రానికి డిజిటల్ ప్రసారం హక్కుల రూపంలో అరవై నుంచి డబ్బై కోట్లు వస్తుంటాయి. అయితే, థియేటరికల్ రిలీజ్ లేకపోవడం వల్ల దీనికి 125 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు.

అయితే దీనికి సంబంధించి మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. దక్షిణాది హిట్​ చిత్రం ‘కాంచన’ రీమేక్​గా ఈ ఫిల్మ్ రూపోందింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు.