మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సూర్య,కార్తీ ..

39
Surya Karthi

ఒకే ఇంట్లో అన్నాద‌మ్ములు ఇద్ద‌రూ స్టార్స్ కావ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. సూర్య‌-కార్తి విష‌యంలోనూ ఇది జ‌రిగింది. ద‌క్షిణాదిన స్టార్ హీరోలుగా వెలిగిపోతున్నారు ఈ బ్ర‌ద‌ర్స్. ఇద్ద‌రూ విడివిడిగా న‌టిస్తూనే అద్భుతాలు చేస్తున్నారు. అలాంటిది ఇద్ద‌రూ ఒకే సినిమాలో క‌లిసి న‌టిస్తే అభిమానుల‌కు పండ‌గే ఇంక‌. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది.

పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మ‌ల‌యాళ‌ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’. అక్క‌డ మంచి విజ‌యం సాధించిన ఈ సినిమానే తమిళ్‌లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మ‌రి దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

ఇదిలావుంచితే, ఈ మలయాళం చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ, రానాలతో దీనిని ఆయన రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.