ఛ‌త్తీస్‌ఘ‌డ్ మాజీ సీఎం మృతి..

45

ఛ‌త్తీస్‌ఘ‌డ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి(74 ఏళ్లు) శుక్రవారం తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. గుండెపోటు రావ‌డంతో జోగిని రాయ్‌పూర్‌లోని ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చేర్పించారు. మే 9వ తేదీన ఆయ‌నకు తొలిసారి గుండెపోటు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అప్ప‌టి నుంచి ఆయ‌న హాస్పిట‌ల్‌లో వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

Former CM Ajit Jogi

అజిత్ జోగి రాజ‌కీయాల్లోకి రాక‌ముందు క‌లెక్ట‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎ‌న్నిక‌య్యారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ టెక్నాల‌జీ కాలేజీలో జోగి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయ‌న యూనివ‌ర్సిటీ గోల్డ్ మెడ‌ల్ సాధించారు. రాయ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కొన్నాళ్ల పాటు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. ఐపీఎస్‌, ఐఏఎస్‌గా కూడా ఈయ‌న సెల‌క్ట్ అయ్యారు. భోపాల్ క‌లెక్ట‌ర్‌గా 1981 నుంచి 1985 వ‌ర‌కు ప‌నిచేశారు. 2000 న‌వంబ‌రు నుంచి డిసెంబ‌రు 2003 వ‌ర‌కు ఆయన ఛ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.