అక్ష‌య్ కుమార్ ‘ల‌క్ష్మీ బాంబ్’ ట్రైల‌ర్‌..

95
Laxmmi Bomb trailer

రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న హార‌ర్ కామెడీ చిత్రం ల‌క్ష్మీ బాంబ్. ఇది కాంచన చిత్రానికి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ – అక్షయ్ కుమార్ రొమాన్స్ ఓ రేంజులో ఆకట్టుకోనుందట. తాజాగా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్ విషయానికొస్తే.. దెయ్యాలు, భూతాల‌నేవి లేవు అనే డైలాగ్‌తో ప్రారంభం కాగా, దెయ్యాన్ని చూసిన రోజు నేను గాజులు వేసుకుంటా అంటూ అక్ష‌య్ సీరియ‌స్‌గా డైలాగ్ చెప్పారు. మ‌రో సీన్‌లో ఎరుపు రంగు చీర ధ‌రించి నేను ఎలా ఉన్నాను చెప్పండి. బావున్నా క‌దూ.. న‌న్ను వ‌దులు.. న‌న్ను ముట్టుకోవ‌డానికి నీకెంత ధైర్యం అంటూ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌న‌బ‌రించారు. ఇక చిత్రం న‌వంబ‌ర్ 9న ఓటీటీలో విడుద‌ల కానుంది.