బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

179
MLA Gongidi Sunitha

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శుక్రవారం ఆలేరు మున్సిపల్ పరిధిలోని సాయిగూడెంలో ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ దయామని, పీఎసీఎస్ చైర్మన్ మల్లేశం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల,మతాలకు అతీతంగా చీరెలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని ఎమ్మెల్యే,సునీత అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండుగకు మహిళలకు దుస్తులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చీరెలను పంపిణీ చేశామన్నారు. పండుగలకు సీఎం కేసీఆర్ పెద్దన్నల వ్యవహరిస్తున్నారని ఆమె కొనియాడారు.