- Advertisement -
బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనాపై పోరుకు రూ. 28 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్…తాజాగా మరో రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
ముంబై పోలీసులకు ఈ డబ్బును అందజేస్తున్నట్లు ప్రకటించిన అక్షయ్..కరోనాపై పోరుకు తమ ప్రాణాలను ఒడ్డి పోలీసులు పోరాడుతున్నారని చెప్పారు.
పోలీసుల వల్లే అందరం భద్రతగా ఉన్నామని …నా వంతు బాధ్యతను నేను నిర్వర్తించాను. మీరు కూడా చేస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు అక్షయ్. ఇక తమకు సాయం అందించిన అక్షయ్‌కు ముంబై పోలీస్ శాఖ ధన్యవాదాలను తెలియజేసింది.
- Advertisement -