అక్షయ్‌ కి ఒక్కరోజుకే అన్ని కోట్లా..?

159
Akshay Kumar charged more than Rajinikanth for Robot 2.0!

2010లో విడుదలై ‘రోబో’ సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్లతో వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా శంకర్ రూపొందిస్తున్న సినిమా ‘2.0’. ఈ సినిమాని రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు సమాచారం.

అయితే ఈ సినిమాలోని కొన్ని పవర్‌ఫుల్‌ క్యారెక్టర్ల కోసం బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను అక్షయ్ కుమార్ తీసుకున్నాడని తెలుస్తోంది.
 Akshay Kumar charged more than Rajinikanth for Robot 2.0!
అక్షయ్‌ కి రోజుకు రూ. 2 కోట్లు నిర్మాతలు పారితోషికంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కోసం అక్షయ్‌ ప్రతిరోజు చాలా మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఆయన తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు మేకప్‌ వేసుకోలేదు. దీంతో అక్షయ్‌ అంత మొత్తంలో రెమ్యూనరేషన్‌ ని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో అక్షయ్‌ దాదాపు 12 పాత్రల్లో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నారు.
 Akshay Kumar charged more than Rajinikanth for Robot 2.0!
ఇక భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్‌ హీరోయిన్ గా నటించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. అయితే ఈసినిమాని దీపావళికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర టీమ్‌. ఇదిలా ఉంటే..దీపావళి కానుకగా రానున్న ఈ సినిమా పై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రోబో సినిమా కంటే.. ఈ సీక్వెల్‌ మరిన్ని సంచలనాలు సృష్టిస్తోందని భావిస్తున్నారు ప్రేక్షకులు.