జర్నలిస్ట్‌ సహృదయతకు అభినందనలు

234
Akkineni Ramesh appreciates Film journalist
Akkineni Ramesh appreciates Film journalist
- Advertisement -

తోటివారి కష్టాలకు స్పందించే గుణం కల ఫిలిం జర్నలిస్ట్ లను అభినందిస్తున్నానని అన్నారు అక్కినేని రమేశ్ ప్రసాద్. ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో పని చేస్తున్న దేవులపల్లి వెంకటేశ్వర ప్రసాద్ (41) ఆకస్మిక మృతి చెందారు. లంగ్ ఇన్ఫెక్షన్ తో మృతి చెందిన ఆయనకు భార్య మాధురి, ఇద్దరు చిన్న పిల్లలు వేద ప్రకాష్, ప్రనదీప్ ఉన్నారు. డివి ప్రసాద్ ఫిలిం జర్నలిస్ట్ లతో ఎంతో చనువుగా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన ఆకస్మిక మృతికి కలత చెందిన ఫిలిం జర్నలిస్ట్ లు ఆర్ధిక సహాయం అందించాలని భావించారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టి ఎఫ్ జె ఎ)ఆధ్వర్యంలో డెబ్భై ఒక్క వేల రూపాయల సహాయాన్ని రమేశ్ ప్రసాద్ చేతుల మీదుగా ఆయన భార్య మాధురి, పిల్లలకు అంద జేశారు. బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో టి ఎఫ్ జె ఏ అధ్యక్షులు నారాయణ రాజు, కార్యదర్శి గోరంట్ల సత్యంలతో పాటు పసుపులేటి రామారావు, సినీ వినోదం రాంబాబు, ఇన్ కేబుల్ శ్రీను, సాంబ శివరావు, రాధాకృష్ణ, శ్రీకాంత్, టి ఎస్ ఎన్ మూర్తి, భారత్ టుడే రెడ్డి, మారన్న, 10టివి సతీష్, దయ్యాల అశోక్ , సుజన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -