సమంతకు ఆ పాట అంటే చాలా ఇష్టంః నాగచైతన్య

264
Nagachaitanya Samantha

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమూవీ నుంచి ఏయ్ పిల్లా అనే సాంగ్ ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. సమంతకు తామిద్దరం తొలిసారి యాక్ట్ చేసిన ‘ఏమాయ చేసావే’ సినిమాలోని ‘ఈ హృదయం కరిగించి వెళ్లకే’ పాటంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సమంత అవును అని సమాధానం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో చైతన్య ఓ ట్వీట్ చేశాడు. మీకు ఇష్టమైన ప్రేమ పాట ఏంటి ? అని నెటిజన్లను అడిగాడు. ఇక నాకు మాత్రం చాలా ఇష్టమైన ప్రేమ పాటల్లో సాహసం శ్వాసగా సాగిపో’ లోని వెళ్లిపోమాకే… పాటంటే ఇష్టమని చెప్పాడు. అలాగే మీరు కూడా మీకిష్టమైన పాట ఏమిటో చెప్పండి అని #myfavlovesong అనే ట్యాగ్‌ను ట్వీట్ చేశాడు. నాగచైతన్య చేసిన ట్వీట్ చాలా మంది అభిమానులు రిప్లై ఇస్తున్నారు.