షేక్‌ హ్యాండ్ వద్దు..నమస్కారం పెట్టండి

587
vijay devarakonda
- Advertisement -

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 56 కేసులు నమోదుకాగా తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బంది చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా అవగాహన చర్యలు చేపట్టగా తాజాగా సినీ హీరో విజయ్ దేవరకొండతో కరోనాపై వీడియోని రూపొందించింది.

కొన్నాళ్ళు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, స్నేహితులు, సన్నిహితులు కలిసినపుడు నమస్కారం పెట్టాలని ఈ వీడియోలో విజయ్ సూచించాడు. అలానే పదేపదే ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకునే ప్రయత్నం చేయకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి గంటకు ఒకమారు చేతులు శుభ్రంగా కనుక్కోవాలని, ఇలా చేయడం వలన కరోనా నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుందని వీడియోలో సూచించారు.

- Advertisement -