అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి మూవీ ఫేం దర్శకుడు శివ నిర్వాణ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రానికి మజిలి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతుంది. మనం సినిమా తర్వాత చైతన్య సమంత కలిసి ఏసినిమాలో నటించలేదు.
ఆ రకంగానూ ఈమూవీతొ చాలా స్పెషల్ మూవీగా ఫీలవుతున్నారు అభిమానులు. ఈమూవీలో వీరిద్దిర రెమ్యూనరేషన్ గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈచిత్ర నిర్మాత సాహు వీరిద్దరికి కలిపి ఒకే చెక్ ను ఇచ్చేరంట. రూ6 కోట్ల 60 లక్షల జాయింట్ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిసింది.
ఇప్పుడు ఈ చెక్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక చైతూకి కూడా ఈమధ్య సరైన హిట్ లేకపోవడంతో ఈమూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇటివలే విడుదలైన సవ్వసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా అనుకున్నంతగా వసూళ్లను రాబట్టలేకపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీని వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.