నాగ్‌కు ఊహించని షాక్‌

191
Akkineni Foundation lose FCRA registration
- Advertisement -

సినీ నటుడు అక్కినేని నాగర్జునకు గట్టి షాక్ తగిలింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్‌ సమర్పించని పలు ఎన్జీవో సంస్థల గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఏపీలోని 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కోల్పోయిన వాటిలో బిర్లా ఆర్కియాలాజికల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌తో పాటు పలు విద్యా సంఘాలు, క్రైస్తవ, ముస్లిం మత సంఘాలు కూడా ఉన్నాయి.  వార్షిక రిటర్నులను దాఖలు చేయాల్సిందిగా మొత్తం 5,922 ఎన్జీవోలకు  నోటీసులు పంపాగా ..రిటర్న్స్ సమర్పించని  4,867 ఎన్జీవోల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామరు.

2004లో అక్కినేని ఫౌండేషన్ స్ధాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా సినీరంగానికి చెందినవారికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డులను అందజేస్తున్నారు. అలాగే అక్కినేని కుటుంబం స్వస్థలమైన గుడివాడతో పాటు పలుచోట్ల హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు.

- Advertisement -