గెలవకుండానే సంబరాలు..కట్ చేస్తే..!

215
WBBL: Sydney Sixers Steal Quick Single to Tie Match
- Advertisement -

క్రికెట్ చరిత్రలోనే ఇదో అరుదైన సంఘటన. మ్యాచ్ పూర్తికాకముందే గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. తీరా చూస్తే నష్టం జరిగిపోయింది. అయితే సూపర్ ఓవర్‌లో గట్టెక్కినా మ్యాచ్ జరిగిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ రెనిగేడ్స్‌తో సిడ్నీ సిక్సర్స్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన సిడ్నీ సిక్సర్స్  గెలవాలంటే చివరి బంతికి 23 పరుగులు చేయాలి.

స్టేడియం అంతా ఉత్కంఠ. మ్యాచ్ సూపర్ ఓవర్‌ వైపు వెళుతుందా లేదా అన్న సందేహంలో ఉండగానే అద్బుతం జరిగిపోయింది. బౌలర్ బాల్ వేయడం బ్యాట్స్ ఉమెన్ దానిని కొట్టడం..బాల్ వికెట్ కీపర్ల వెనుక ఫీల్డర్ చేతిలో పడటం..దానిని కీపర్ ఓడిసి పట్టడం చకచక జరిగిపోయింది. కేవలం ఒకే రన్ రావడంతో ఫీల్డర్లంతా గెలుపుసంబరాల్లో మునిగిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఆశ్చర్యపోవడం మెల్ బోర్న్, ప్రేక్షకుల వంతైంది.

ఫీల్డర్ క్రిస్ బ్రిట్ వెంటనే బాల్‌ను వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లిస్‌కు వేసినా.. ఆమె వికెట్లను గిరాటేయకుండా గెలిచామంటూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది గమనించిన ప్రత్యర్థి బ్యాట్స్‌వుమెన్.. మరో పరుగు తీసి మ్యాచ్‌ను టై చేశారు. బాల్ అప్పటికే డెడ్ అయిపోయిందేమో అని రెనిగేడ్స్ టీమ్ అంపైర్ల వైపు ఆశగా చూసింది. కానీ అంపైర్లు మాత్రం మ్యాచ్‌ను టై అయినట్లు డిక్లేర్ చేశారు. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.  అయితే అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది రెనిగేడ్స్ టీమ్.

- Advertisement -