అక్కినేని ఫ్యాన్స్ ధర్నా

4023
- Advertisement -

వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య తన స్పీచ్ లో అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడం వైరల్ అయింది. బాలయ్య అక్కినేని లాంటి సీనియర్ యాక్టర్ ను పట్టుకొని తొక్కినేని అనడం అక్కినేని కుటుంబానికే కాదు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బంది కలిగించింది.

అయితే తాజాగా అక్కినేని యంగ్ హీరోలు చైతూ, అఖిల్ ఇద్దరూ ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్య పేరు పెట్టకుండా నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు వీరు కళామతల్లి ముద్దు బిడ్డలు వీరిని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం కించపరుచుకోడం అంటూ చురకలు అంటించారు.

ఇక ఇవ్వాళ అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయంపై స్పందిస్తూ ధర్నా కు దిగారు. కూకట్ పల్లి అర్జున్ థియేటర్ దగ్గర బాలయ్య అక్కినేని కి క్షమాపణ చెప్పాలంటూ ధర్నా చేశారు. జై అక్కినేని అంటూ నినాదాలు చేస్తూ బాలయ్య నుండి క్షమాపణ డిమాండ్ చేశారు. మరి మిగతా చోట్ల కూడా అక్కినేని ఫ్యాన్స్ ధర్నాలు చేసే అవకాశం ఉంది. మరి బాలయ్య క్షమాపణ చెప్తారా? అంటే కష్టమనే సమాధానమే ఇండస్ట్రీ నుండి వినిపిస్తుంది. చూడాలి ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో?

ఇవి కూడా చదవండి…

గుండెలపై ఎంజీఆర్ బొమ్మ….

జనవరి 30…దసరా టీజర్‌

పిక్ టాక్ : క్లీవేజ్ అందాలు బాబోయ్..

- Advertisement -