‘వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్’ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

486
amala met with minister indrakarn reddy
- Advertisement -

వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు రావాలంటూ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆహ్వానించారు బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.ఈ నెల 8 నుంచి 10 వ‌ర‌కు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ జరుగనుంది.వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని ప్ర‌శంసించారు అక్కినేని అమల.

. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ… హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, వన్యప్రాణుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కొనియాడారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి పెద్దపులులు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని, వాటి సంర‌క్ష‌ణ‌కు మ‌రిన్నిచ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా హైటికోస్ సంస్థ ఆద్వ‌ర్యంలో పులుల సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆమె మంత్రికి వివ‌రించారు.

- Advertisement -