శ్రద్దా కపూర్ బర్త్ డే..సాహో టీం స్పెషల్ గిప్ట్(వీడియో)

247
saasho
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ సరసన సాహో మూవీలో నటించగా, బాలీవుడ్ లో స్ట్రీట్ డ్యాన్సర్ అనే చిత్రాలలో నటిస్తుంది. ప్రస్తుతం శ్రద్దా కపూర్ నటిస్తున్న రెండు చిత్రాలు భారీ బడ్జెట్ మూవీలు కావడం విశేషం. ఇప్పటి వరకూ బాలీవుడ్ లో తన సత్తా చాటిన శ్రద్దా సాహో మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఆగస్ట్ 15న సాహో మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈరోజు శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సాహో చిత్ర యూనిట్ ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చారు. షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2 పేరుతో మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు హాలీవుడ్ సినిమాని త‌లపిస్తున్నాయి.

ప్ర‌భాస్, శ్ర‌ద్ధా లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి మూవీ ఘన విజయం తర్వాత వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కు అభిమానులు పెరిగిపోయారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈచిత్రానికి రన్ రజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్ధ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈచిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -