అఖిల్ మూవీలో టాప్ హీరోయిన్

230
Akhil
- Advertisement -

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ఇప్పటి వరకూ మూడు సినిమాల్లో నటించిన అవి అంతగా విజయం సాధించలేదు. సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు అఖిల్. మిస్టర్ మజ్ను మూవీ కాస్త పర్లేదు అనిపించినా బాక్సాఫిస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకొలేదు. ఇక అఖిల్ నాల్గవ చిత్రం బొమ్మరిల్లు సినిమా దర్శకుడు భాస్కర్ తో చేయనున్నాడు. ఈమూవీకి ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈసినిమాలో హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించారు చిత్రయూనిట్. అయితే చివరగా గీత గోవింద హీరోయిన్ రష్మీక మందన పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. రష్మీక కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటివలే ఆమె నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు సాధించాయి. ఆమె గ్లామర్ కి తోడు అఖిల్ ఫాలోయింగ్ తోడైతే ఈసినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు ధియేటర్లకు రప్పించేలా కథను సిద్దం చేస్తున్నారట దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఈమూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలు చేసి, రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.

- Advertisement -