అఖిల్ కు జీవితంలో పెళ్లికాదు…!

289
akkineni akhil marriage shocking predictions by venuswamy
- Advertisement -

వేణు స్వామి… తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు, తాజా రాజకీయ పరిణామాలను తనదైన విశ్లేషణతో దానికి జ్యోతిష్యం జోడించి సంచలనం సృష్టించడంలో సిద్దహస్తులు. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాత్రమే శ్రద్ధపెట్టిన ఈ జ్యోతిష్యుడు త్వరలో తమిళనాట రాజకీయాల్లో పెను మార్పు జరగబోతోందని దక్షిణాదిలో ఇద్దరు సీఎంలకు ప్రాణగండం ఉందని చెప్పి సంచలనంగా మారాడు. ఆయన చెప్పిన ప్రకారం కొద్ది రోజుల్లోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడం ఇప్పటికి పరిస్థితి అనిశ్చితిగా ఉండటం చూస్తున్నాం.

akkineni akhil marriage shocking predictions by venuswamy

ఇక ప్రస్తుతం ఈ వేణుస్వామి అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పిన జ్యోతిష్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్- శ్రీయా ఎంగేజ్ ఇటీవలె జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల ఇటలీలో జరగాల్సిన వీరి పెళ్లి పెళ్లి క్యాన్సిల్ అవుతుందన్న పుకార్లు షికర్లు చేస్తున్నాయి. దీనికి ఇరు కుటుంబాలు తమ టికెట్లను క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి జరగదని జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన పంచాగం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

అఖిల్-శ్రీయా ఇద్దరి జాతకంలో దోషం ఉందని ఎంగేజ్ మెంట్ జరిగినా క్యాన్సల్ అవుతుందని వేణు స్వామి తెలిపారు. ఒక వేళ పెళ్లి జరిగిన విడాకులు తప్పవని విపరీతమైన సమస్యలు రావటం తప్పవని తెలిపాడు.

ఇదే జ్యోతిష్యుడు చైతూ సమంత జాతకాల్లో ఉన్న దోషాల దృష్ట్యా వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపిన సంగతి తెలిసిందే. సహజసిద్ధంగా చైతన్య తండ్రికాలేడని…టెస్టు ట్యూబ్ బేబి ద్వారా తండ్రి అయ్యే విషయం చెప్పలేమన్నారు. అంతేకాదు సమంత నాగచైతన్యను చేసుకోవడం చైతుకే కలిసివచ్చే అవకాశం ఉందని వెల్లడించాడు.
akkineni akhil marriage shocking predictions by venuswamy
సమంతకు కుజదోషం…నాగచైతన్యకు కాల సర్ప దోషం ఉందని తెలిపాడు. వీరిద్దరి జాతకం దృష్ట్యా వీరికి పెళ్లైతే సంసారిక సుఖం ఉండదని వెల్లడించాడు. అంతేగాదు భార్యభర్తలు ఇద్దరు దూరం ఉండే అవకాశం ఉందని వెల్లడించాడు. పెళ్లైన త్వరలో వీరు విడిపోవటం..గొడవలు కుటుంబ సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇప్పుడు ఇదే జ్యోతిష్యుడు అఖిల్ గురించి చెప్పడం వైరల్‌గా మారింది.

- Advertisement -