ఆచార్య…రిపబ్లిక్ డే గిఫ్ట్

41
acharya

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు కీ రోల్ పోషిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.

‘ఆచార్య’ టీజర్ ను రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ‘సిద్ధ’గా కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 25 కోట్ల విలువైన భారీ సెట్ నిర్మించారు. సినిమాలో ఎక్కువ భాగం అక్కడే పూర్తవుతుంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.