జగన్ ఆందోళనకు అఖిలేష్ సపోర్టు..బుల్డోజర్ పద్దతి సరికాదు

20
- Advertisement -

ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై హత్యాకాండ జరుగుతోందని ఆరోపిస్తు జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు మద్దతిచ్చారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ఏపీలో వైసీపీ పార్టీ టార్గెట్‌గా దాడులు జరగడం సరికాదని, విపక్షాలపై అరాచకాలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లవని , కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని…ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారని. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అని చెప్పారు. జగన్ చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు.

ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని, దీనిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు జగన్. దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని …బాధితుల పైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని ..లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు.

Also Read:పేమెంట్ కోటాలో వచ్చావా?, రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

- Advertisement -