ప్రధానిగా యోగి..అఖిలేష్‌ సంచలనం!

17
- Advertisement -

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన కామెంట్ చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్‌ యాదవ్‌ సంచల కామెంట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే బీజేపీ కుట్రలో ఇదొక భాగమని తీవ్ర ఆరోపణలు చేశారు.

కుంభమేళాను యోగి సర్కార్ రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని… తదుపరి ప్రధానిగా తనను ప్రకటించుకునేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారు….దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనుక బీజేపీ పాత్ర ఉంటుందన్నారు.

మతాల మధ్య చీలికలు సృష్టిస్తుంది బీజేపీనే అని… దీని కోసం ఎంతైన ఖర్చు చేస్తారన్నారు. ప్రజల సమస్యలను బీజేపీ పట్టించుకోవడం లేదు… ఈ ప్రభుత్వానికి పకోడా, భగోడా రెండు విజయాలు. ఎవరైనా ఉద్యోగం కోరుకుంటే పకోడాలు తయారు చేయాలని సూచిస్తారు అని నిప్పులు చెరిగారు.

Also Read:మజ్జిగతో ఉపయోగాలు తెలుసా!

- Advertisement -