ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎంతైన ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇష్టంగా కొనుగోలు చేసే వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని కోరుకుంటున్నారు.
గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త 30 లక్షలు పెట్టి కొన్న టయోటా ఫార్చునర్ కోసం ఏకంగా 34 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేశాడట. ఆ వ్యక్తి జేమ్స్ బాండ్ ఫ్యాన్ కావడంతో.. ఆ తరహా ఫ్యాన్సీ నెంబర్ 007 కోసం అతడు ఏకంగా 34 లక్షలు చెల్లించాడు.
తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా తనకు నచ్చిన నెంబర్ కోసం ఏకంగా లక్షలు ఖర్చు పెట్టారు. శనివారం జరిగిన వేలంలో TG 09 F 0001 నెంబర్ ను 7 లక్షల 75వేలకు దక్కించుకున్నారు. తన బీఎండబ్ల్యూ వాహనం కోసం బాలయ్య ఈ నంబర్‌ను తీసుకున్నారట.
Also Read:మజ్జిగతో ఉపయోగాలు తెలుసా!
అలాగే TG 09 9999 నెంబర్ కోసం ఏకంగా 25 లక్షలు వెచ్చించారు. టీజీ సిరీస్ లో TG 09 0001 కోసం ఓ సంస్థ 9 లక్షలకు పైగా చెల్లించి ఆ నెంబర్ ను దక్కించుకుంది. ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో ఒక్క ఖైరతాబాద్ జోన్‌లోనే రవాణశాఖకు ఒక్కరోజులో 37లక్షల 15వేల 645 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

