బీజెపీ విక్టరీ పై అఖిలేష్‌ పంచ్‌..!

209
akhilesh comments on bjp victory
- Advertisement -

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ గుజరాత్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డ బీజేపీపై అఖిలేష్‌ విమర్శలు గుప్పించారు. గుజరాత్ ఫలితాల్లో బీజేపీ తృటిలో ఓటమిని తప్పించుకుందని, కేవలం కుల, మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల నుంచి బీజెపీ ఓట్లు రాబట్టుకుందని అన్నారు.

 akhilesh comments on bjp victory

ఇవాళ (మంగళవారం) మీడియాతో మాట్లాడిన అఖిలేశ్…ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో మరికాస్త చూపించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని బీజెపీకి పంచ్‌ విసిరాడు. హార్ధిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ లాంటి ఓబీసీ నేతలు, దళిత నేతలతో కలిసి పోరాటం కొనసాగిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అద్భుత ఫలితాలు సాధిస్తుందని అఖిలేశ్ అన్నారు.

అంతేకాకుండా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదో నామమాత్ర విజయాన్ని సాధించిందన్న అఖిలేష్‌ ,అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ ప్రస్తావించే బీజేపీ.. అభివృద్ధి కంటే కూడా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే చాలా తక్కువ స్థానాల్లో నెగ్గిందన్నారు. గుజరాత్‌లో తరహాలోనే ప్రాంతీయ పార్టీలు, నేతలతో పొత్తుకుని బరిలోకి దిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓడిస్తుందన్నారు.

- Advertisement -